మేలుకొలుపు - డాక్టర్ అడిగొప్పుల సదయ్య
01.
నీలిమేఘము నీదు కాయము నిల్చి కాంతులఁ జిమ్మగా
జాలి సంద్రము నీదు కన్నుల జారి తేనెలఁ జల్లగా 
యాలి లచ్చిమి నీదు గుండియ నాక్రమించుచు నిండగా 
మేలి దైవమ! మ్రోల నిల్తిమి,మేలుకో,ధర నేలుకో!

02.
పాలసంద్రము,నాదిశేషువు పాన్పుగా పవళించి,వే
వేల జీవుల పాలనంతయు వేలి దాల్తివి పేర్మితో 
కాలమే తమ చక్రమై గమకాలతో తెలవారెనే
మేలి దైవమ!,మ్రోల నిల్తిమి, మేలుకో,ధరనేలుకో!
===========================

డాక్టర్ అడిగొప్పుల సదయ్య 
వ్యవస్థాపక అధ్యక్షుడు 
మహతీ సాహితీ కవిసంగమం 
కరీంనగరం
9963991125

కామెంట్‌లు