*ఆటవెలది పద్యం*
కొక్కులన్ని కలిసి బొక్కెన పసిగట్టి
అడుగునున్న మట్టి నడ్డుకున్న
పట్టిలాగి తెచ్చు పాతాళ గరిగెయు
బోక్కెనెగిసి వచ్చు చిక్కినంత
*తెటగీతి పద్యం*
చేద బావినందున నీళ్ళు చేదతలచి
బొక్కె నేసినంతన జారె పురిల తాడు
గిలక సర్ది కొక్కెమిసిరి గిరగిరనుచు
తాడు కలిసిన పట్టుకు తనువు మురియు
*కంద పద్యం*
బొక్కెన తెగినంతగనిన్
కొక్కెర తాడుకు బిగిసియు కూడిన నీటన్
సక్కగ దిగినంత వెతక
మిక్కిలి లోతేగి పట్టి మీదికి తెచ్చున్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి