కాలం చాలా విలువైనది
జీవన గమనమై సాగుతుంది
కాలం చాలా తెలివైనది
జీవిత పయనాన్ని గమనిస్తుంది
కాలం చాలా చురుకైనది
ఒడుపైన పనుల తీరు వెతికిపెడుతుంది
కాలం చాలా ప్రియమైనది
చెలిమ వంటి చెలిమి బలిమిని చూపెడుతుంది
కాలం చాలా సొగసైనది
తరుల,గిరుల,ఝరుల
సోయగమ వుతుంది
కాలం చాలా మెరుగైనది
మరల, మరల శ్రమను చేయమంటుంది
కాలం చాలా సరసమైనది
నిద్రాణమైన భావనలను తట్టిలేపుతుంది
కాలం చాలా చంచలమైనది
తిరిగి రాలేని తనను తెలుసుకో మంటుంది
కాలం చాలా దయాగుణం కలది
ఆత్మీయులను దరిచేర్చి హాయినిస్తుంది
కాలం చాలా కరుణ కలిగినది
సమయమెరిగి హితుల కలిపి నిలుపుతుంది
కాలం చాలా మేలైనది
మంచి చెడులను బేరీజు వేసి పెడుతుంది
కాలం చాలా శ్రేయమైనది
మనసు మమతల కోవెలవుతుంది
కాలం చాలా కఠినమైనది
తనను తెలియనివారికి అందనంటుంది
కాలం చాలా కరుకైనది
ప్రకోపిస్తే తనను ఆపలేరంటుంది
కాలం చాలా ఘనమైనది
మన ప్రతి కదలికను నడిపే యంత్రమవుతుంది
కాలం చాలా గుణమైనది
మనని మనకు చూపే అద్దమవుతుంది
కాలం చాలా సహజమైనది
చలితమైన మనసుల చారలు గీసి పెడుతుంది
కాలం చాలా జ్వలనమయినది
రగిలే గుండెల బాధకు భాస్వర మవుతుంది
కాలం చాలా సారమయినది
చేరువ దూరము తీరమయి సాగుతుంది
కాలం చాలా మాన్యమయినది
గురువులా జ్ఞాన సిరులనందిస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి