చిరుగాలి నవ్వుల వడగాలి బాధలు చినుకు
ఊరు లేచి కదిలే తెల్లవారకముందే పనులకు
పిల్లలంతా పలక బలపంపట్టి బడికి రయ్ రయ్
సార్ల మమత లాల్ మహమ్మద్ చప్రాసీ చేతి బరిగె
బడికి వచ్చిన ఓనమాలు దెబ్బలే రాకపోతే
నడక నడతలకు పాదులేసిరి చదువు మొక్కలకు
అమ్మనాన్నలు చిరికిగా* బడికెళ్ళ బాబు
పడిలేచి ఆడే బడిబాట అఆల ఆనందం
జ్వరమొస్తె పసిపిల్లల తల్లడిల్లే ఎదతల్లి ఇల
ఓరిమితో కూరిమి సమకూర్చె బతుకు
బాలగొంతు యవ్వనగంతు వృద్ధకాంతీ ఊరు
వయసు తప్పే కాని మనిషిది కాదేమో ఇల!
బతుకంత అనుభవం ఆరబోసిన సీమ ఊరు
అనుభూతి తేలించే యాది మునకెసి ఇంకె మది
నాకు మాత్రమే కాదు ఊరంత వాకిలి చెలి నెచ్చెలి
మట్టి పొరలదేలిన మనసంత తడిసే స్నేహమల్లె
ప్రేమమీరగ పలుకు ఎలనాగ కనుల ఊరు రక్ష
మనసులేక మనిషి ఉండని చోటిది పాట ఎలదేటి
ప్రకృతి అందాలు ఆరబోసే ఆనంద నాట్యమై
చెట్టంత అండగా మనసు వెండి కొండ మనిషికి
పసినవ్వుల పసిడి పూల వాన బతికె బతుకమ్మ
==============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి