అనగనగా ఒక ఊరిలో లక్ష్మణ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, లక్ష్మణ్ చాలా పేదవాడు అయితే ఒక రోజు లక్ష్మణ్ తోటలో చెట్లు నాటుదాం అని అనుకుంటాడు, కానీ లక్ష్మణ్ దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు, అప్పుడు ఆ ఊరిలో ఉన్న కొంతమందిని సహాయం కావాలని అడిగాడు,ఆ ఊరి ప్రజలు ఎవరూ కూడా సహాయం చేయలేరు,లక్ష్మణ్ కష్టపడి తన తోటలో చెట్లను నాటాడు, ఆ చెట్ల వల్ల ఆ గ్రామంలో వర్షాలు పడ్డాయి,పంటలు కూడా బాగా పండాయి, ఆ ఊరిలో ఉన్న ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకరోజు ఒక వ్యక్తి పట్టణం నుంచి వచ్చాడు, ఆ వ్యక్తి పేరు రాము,ఆ రాము ఒక మంచి చోటు చూసి ఒక బిజినెస్ పెడదామని అనుకుంటాడు, అన్ని చోట్ల చూస్తాడు, అప్పుడు రాముకు లక్ష్మణ్ స్థలం కనపడుతుంది, ఈ చోటు అయితే బిజినెస్ పెట్టుకోవడానికి సరైనదని అనుకుంటాడు, అప్పుడు లక్ష్మణ్ నాటిన చెట్లు అన్నింటిని నరికివేస్తాడు,ఆ స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. అప్పట్నుంచి ఆ గ్రామంలో వర్షాలు పడడం లేదు మరియు పంటలు కూడా సరిగ్గా పండటం లేదు. ఆ ఊరిలో ఉన్న ప్రజలు అందరూ కష్టాల పాలయ్యారు,వర్షాలు లేక, తిండి లేక, నీరు లేక, బాధపడ్డారు,ఒక్క రోజు ఆ ఊరిలో ఉన్న ప్రజలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు,అందరూ లక్ష్మణ్ ఇంటికి వెళ్లారు ఒక వ్యక్తి లక్ష్మణ్ తో ఇలా అడిగాడు,నువ్వు సహాయం చేయమన్నప్పుడు మేము సహాయం చేయలేదు,ఇప్పుడు ఆ పట్నం నుంచి వచ్చిన ఆ రాము,నీ స్థలంలో నాటిన చెట్లు అన్నింటిని నరికాడు అప్పటినుంచి మన ఊరిలో వర్షాలు మరియు పంటలు పండట్లేవు, ఎలాగైనా మనము అందరము కలిసి రాముతో మాట్లాడి, ఒప్పించి మన ఊరిని కాపాడుకుందాం అని అక్కడ ఉన్న అందరూ లక్ష్మణ్ తో అన్నారు,లక్ష్మణ్ కూడా ఒప్పుకున్నాడు, లక్ష్మణ్,రాము దగ్గరకు వెళ్లి నీ పట్నానికి నీవు వెళ్ళు అని అన్నాడు,అక్కడ ఉన్న ప్రజలు కూడా రాము తోటి గొడవ పెట్టుకుని ఎలాగైనా రాముని పట్నం కి పంపించారు,రాము కూడా ఆ స్థలాన్ని విడిచిపెట్టి పట్నం కి వెళ్ళిపోయాడు, అందరూ కలిసి లక్ష్మణ్ తోటలో చెట్లు నాటారు, ఆ తర్వాత నుంచి వర్షాలు పడడం, పంటలు బాగా పండడం జరిగింది, అందుకే మనం ఊరిని కాపాడుకోవాలి అందరం ప్రతి పని కలిసి చేయాలి, చెట్లు లేకపోవడం వలన బ్రతకడం కష్టం.
ఈ కథలోని నీతి: మనం పర్యావరణాన్ని రక్షిస్తే అది తిరిగి మనల్ని పరిరక్షిస్తుంది.
ఈ కథలోని నీతి: మనం పర్యావరణాన్ని రక్షిస్తే అది తిరిగి మనల్ని పరిరక్షిస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి