మాటవుంది ....మాట్లాడటం లేదు ...!! ---డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 అంతాబాగానేవుంది 
అన్నీబాగానేవున్నాయి 
ఆడతాడు 
గంతులేస్తాడు 
పరుగులుతీస్తాడు 
నాట్యం చేస్తాడు 
మాటలువల్లిస్తాడు 
అర్ధంకానితనభాషలో -
సంభాషిస్తాడు ....
మనభాషలోమాత్రం 
మాట్లాడడు....!
అలాగే -
ఇష్టమయిన -
తనపనులకోసం 
తనదయిన భాషలో 
ఆజ్ఞాపిస్తాడు !
అనుకున్నది జరగకుంటే 
ఏడుపుతోసాధించుకుంటాడు ,
మా మనవడు ..'నికో '
ఉరఫ్.... నివిన్ ఆయాంశ్ !!
                   ***

కామెంట్‌లు