*ఆటవెలది పద్యం*
పల్లెటూరులందు పచ్చని సౌరులు
ఎడ్లబండినందు యెగుడు దిగుడు
రోలు రోకలందు రువడైన పోటుల
పప్పు దినుసులుండు పల్లెలందు
*కంద పద్యం*
పల్లెల పంటలు పండగ
జల్లుగ ధాన్యంపు సిరులు జలజల రాలున్
మెల్లగ యెద్దులు గెంతిన
గల్లున సవ్వారు బండి గణగణ వెడలెన్
*తెటగీతి పద్యం*
వంకలున్నను దారులు పరుగులౌతు
నడక గమ్యము చేరను నాట్యమౌను
పచ్చదనమున పంటలు పసిడివన్నె
కన్నులందున ఫలములు కలుగునిలను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి