అయ్య పొద్దున్నే లేచి కొట్టం ఊడ్చి
బర్ల కు పాలు పిండేవాడు
అన్నం తిని పొలం పనులకు వెళ్లేవాడు
మధ్యాహ్నం కల్లా అమ్మ సద్ది తీసుకెళ్లలేదు
అమ్మ తీసుకెళ్లిన అన్నం తిని
కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేవాడు
లేచి మళ్లీ పని మొదలు పెట్టి
సాయంత్రం వరకు పనులు చేసేవాడు
సాయంత్రం వచ్చేటప్పుడు పిల్లల కోసం
కొన్ని పెసర కాయలు పల్లి కాయలు తెచ్చేవాడు
అయ్యకు ఎదురు పోయి కండువాలో
తెచ్చిన కాయలను తీసుకొని సంబరపడేవాళ్లు
అవి తిని అయ్య తో కొద్దిసేపు ఆడుకునే వాళ్ళు
వాళ్ళ కోసం కొంత సమయం గడిపేవాడు
అయ్య పిల్లల కోసం ఎంత కష్టమైనా భరించేవాడు పిల్లలను ఎప్పుడు సంతోషంగా ఉంచడం కోసం తాను ఎంత కష్టమైనా చేసేవాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి