అనగనగా ఒక అడవిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకరు చీమ మరొకరు ఉడుత ఒకరోజు ఉడత చీమతో ఇలా అన్నది మిత్రమా మనిద్దరం కలిసి ఒక ఆట ఆడదామా అని దానికి సరే అని చీమ ఉడతతో అన్నది. ఏ ఆట ఆడుదాం మిత్రమా అని చీమఉడుతను అడిగింది. దానికి ఉడుత పరుగుపందెం ఆట ఆడుదామని చెప్పింది.ఈ చింతచెట్టు నుండి వేప చెట్టు వరకు ఎవరు ముందుగా వెళ్తే వారిదే విజయం అని ఉడుత చీమతో అన్నది. గీత మీద ఇద్దరూ నిలబడ్డారు ఊడు త చాలా వేగంగా పరిగెడుతుంది చీమ చిన్న చిన్నగా అడుగులు వేస్తుంది. అప్పుడు చీమతో ఉడతా అన్నది కదా మిత్రమా నువ్వు మెల్లగా నడుస్తూ ఉండు నేను ఇంట్లోకి వెళ్లి వస్తాను అన్నది. ఎలాగైనా నేనే గెలుస్తాను చీమ నాతో సమానంగా పరిగెత్తగలదా అనే ధీమా ఉడుతది. చీమ మాత్రం మెల్లగా గమ్యం వైపు నడుస్తూనే ఉన్నది. ఇంట్లో నుంచి తిరిగి వస్తున్న ఉడుత కు మధ్యలో చెట్టు పైన సీతాఫలం కనిపించింది. దానికోసం చెట్టు ఎక్కి ఆ ఫలాన్ని తినడం మొదలుపెట్టింది. చీమ మాత్రం మెలిమెల్లగా ముందుకు సాగుతూనే ఉన్నది. పండును తిని మెల్లగా చెట్టు దిగిన ఉడతకు చీమ కనిపించలేదు వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. అప్పటికే చీమ గమ్యాన్ని చేరింది. చీమ నాతో పరిగెత్తగలదా నన్ను గెలవ గలదా అనే గర్వం నన్ను ఓటమిపాలు చేసింది అంటూ చీమ దగ్గరికి వెళ్లి ఓటమిని అంగీకరించి క్షమించమని కోరింది. అప్పుడు చీమ ఉడతతో ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదని ఎవరి గొప్ప వారిదేనని తెలియజేసింది.
చీమ ఉపదేశం:- బండారు పూజిత -ఆరవ తరగతి,- ZPHS పామనగుండ్ల, కట్టంగూరు మండలం నల్గొండ జిల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి