స్ఫూర్తిప్రదాతలు 100:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 దివ్యాంగుల కోసం ముఖ్యంగా జొమాటో లో పనిచేస్తున్న వారికి నియోమోషన్  అనే సంస్థ తయారుచేసిన వాహనం ఎంతో ఉపయోగకరం.మద్రాస్ ఐఐటీలో చదివిన స్వస్తిక్ దాస్ ఆశిష్ సిద్ధార్థ్  స్టాండింగ్ వీల్ ఛైర్ ని తయారు చేశారు.ఆపై నియోబోల్ట్ ని అంటే స్కూటర్ వీల్ ఛైర్ కల్సినవాహనంతో మూడు చక్రాల వాహనం చేసి హాయిగా దివ్యాంగులు పయనించేలా చేయటం ముదావహం!మధురైకి చెందిన సెంథిల్ సేవ్ మామ్  అన్న సంస్థ ద్వారా మాతాశిశుమరణాలను కంట్రోల్ చేశాడు.హైరిస్క్ ప్రెగ్నెన్సీ సమస్య ఉన్న మహిళలకు ఉపయోగ కరంగా ఉండే చేతికి కట్టుకునే మెడలో వేసుకునే దండద్వారా గర్భవతి బి.పి.హార్ట్ రేట్ మొదలైనవి తెల్సుకోవచ్చు. హార్వర్డ్ యూనివర్శిటీ మెప్పుపొందాడు.🌹
కామెంట్‌లు