తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా బాలల్లో సాహిత్య అభిరుచి పెంపొందించి, తద్వారా వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయాలనే ఉదేశ్యం తో సిద్దిపేట జిల్లా లోని ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థులనుండి కథలను ఆహ్వానిస్తున్నామని సుగుణ సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ప్రథమ బహుమతి 1500 రూపాయలు, రెండు ద్వితీయ బహుమతులు 1000 రూపాయలు చొప్పున, మూడు తృతీయ బహుమతులు500 రూపాయలు చొప్పున మరియు 300 రూపాయలు చొప్పున 12 ప్రత్యేక బహుమతులను ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు మర్పడగ చెన్నకృష్ణారెడ్డి అందిస్తున్నారు.హామీ పత్రంతో పాటు విద్యార్థులు తాము వ్రాసిన కథలను "కన్వీనర్, ఉగాది కథల పోటీ,ప్రతిభ డిగ్రీ కళాశాల, మెదక్ రోడ్ సిద్దిపేట-502103 చిరునామా కు 2025 ఫిబ్రవరి,5వ తేదీలోగా స్వయంగా,రిజిస్టర్ పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపగలరు.పూర్తి వివరాలకు 9959007914 సెల్ నంబర్ లో సంప్రదించవచ్చునని తెలిపారు.
ఉగాది బాలల కథల పోటీ -2025 కొరకు విద్యార్థుల రచనలకు ఆహ్వానం:-/- భైతి దుర్గయ్య-కన్వీనర్-సుగుణ సాహితి సమితి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి