ఊరుగాలి ఈల 40:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఆమె నవ్వుల మెరిసే అమ్మ కళ్ళు పాడే గొంతు 
ఎలకోయిల కూసే మావి చిగురు కొమ్మ ఊగి ఇల
లేగదూడ గంతులు గుమ్మ పాల ఆవు నిముర

మనసు మాటల జీవి పుట్టిన ఊరు మట్టి పూవు
వాగు వంకల తిరిగిన ఇసుక జవరాలు నది నుడి
మనసు మురిసిన కాంతి అవని తాకిన నింగి

పసిపాప కేక తల్లి తడి కాక తనువు రుధిరం
గాలి ఈలలు వేసే గళగానమై పల్లె కాంత  కన
అడవి అంతరంగాల లోగిట పదనిసల సందడి

ఊరున్న చోట ఉమ్మడి బతుకు మనసు ఊట
కంచె కాపున సిరులు పచ్చకొమ్మల విరుల నోట
బాధరాయణ బంధం ప్రబంధమైన రాతి కోట

పాద పదముల రాసే పల్లె కావ్యాలు చదువ కీర్తి
అమ్మ అవతార దేవత పల్లెబడిని మడి ఊరు
చేను చెలుక అందాల ఆకలి తీర్చినదె సొంత పల్లె

రహదారుల ఊర్లు మురిసే కొత్త అందాల నారి
బతుకు బండి పరుగెత్తు గిత్తల సొత్తు కొట్టం
అలిసిసొలిసే సీమ ఊరంత చేర మది అక్కున

మనిషి రాసిన పాట ఆనోట ఈనోట బతుకు పాట
రెక్కలెగిరిన పక్షి నింగినీడ తిరిగిన మది ఊరు 
చరిత్ర రాయని సుందర కావ్యం ఊరు గొప్ప

===============================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు