ఊరుగాలి ఈల 44:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
మూగ కాదు శబ్దనిశ్శబ్దాల కలల మౌన ఋషి
మనసు కుదిపేసే గాధల వీరత్వతారక తేజం
ఊపిరి ఊసుల ఊహల ఊయల లూగే  ఊరు

మర్కట శునక మార్జాల మైత్రిలో బతికె మనిషి 
ప్రేమ పంచిన కోవెల మూగజీవాల మానవత ఇల 
చీకటి వెలుగుల పగలురాత్రి మట్టిగడప ఊరు

పరుగు పరువాల బేల పరశించే ప్రవాహ హేల
ఢమరుక మృదంగ డోలు మద్దెల గిరుల శివనాదం 
మందాకిని అలల కృష్ణ గమకాల కళ సుందరం

సంగీత ఝరుల సంగమ సాగర మధనం ఊరు
మధుర మంజుల మనోజ్ఞసీమపల్లె నేలిన భూమి
అవనిసీమల తేలే మధుపాలు గ్రోలేటి పూలతోట

కడపు నిండిన చెరువు ఆకలిదీర్చే ధాన్యసీమ 
ఆటలోపాట పాటలో ఆటల మిలమిల చూసే నేల 
రైతు రాగాల పట్టి సాగే కలుపుదీయ మట్టి రాగిని

రంగుల పొంగులు రమణీయ కొంగుల  వనరాణి 
ఊరు సోయగాలు ఊరంత మేరిసే నింగి మేఘాం
తల్లి సంకల పిల్ల పల్లె వొదిగిన ఇల్లు  గుడిసెరెల్లు

మది దోసె అప్పడాల గోంగూర మామిడి వాహ్వా 
ఎవరని అడిగిన గొంతెత్తి ఎగిరి గౕంతేయు ఊరు
గంగిరెద్దులాట చూడు బాలక్రీడల చక్రి కనుల పల్లె

========================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు