ఊరుగాలి ఈల 49:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
కళల బతుకు విహార స్వప్నసీమ మా ఊరు
ఆశలు పంచిన అవని అందాల పల్లె ఊపిరి
మనిషి ప్రియము స్నేహలతల నేల  అలల తొట్లె

ఆశువు పద్యాల జతులు మమత జన బంధాలు 
అమ్మ కనుల పిలుపున ఊరు నాట్య మయూరి 
అనురాగసీమల ఆనంద సుమమాల ఝరం నేల

అవును కాదను మాట మమత నవ్విన పూదోట
స్వేదరుధిరాలు పనిపాటల పల్లె మనిషి గానం 
ఆనందభైరవి అనురాగ రవి కిరణ చెలిమి ఊరు

అలతి పదముల పొట్టి కవిత చెలి చెక్కిలి గిలి 
ఆనతి మీరని కథల కవ్వాలి పల్లె గుండె గొంతుక
ఆమె పయ్యెదలో దాచింది నన్ను అమ్మేగా ఊరు

వక్రరేఖలో సరళరేఖ మనిషిలోమనిషి ధగధగ పల్లె
రక్తమాంసం నాలో మూగజీవిలో జీవం వేన్న నేల
చెట్టునీడ పుట్టగోడ కప్పు కైవారమే పల్లె గుండె

సీద తోవల బీదబిక్కి నడక బువ్వకుండ ఊరు
మింగమెతుకు లేక కుంగిపోక కొట్లాడిన మట్టి
మాట మనసు వినక పోటీల దూరని చిత్తడినేల

వీధుల కాంతి ఇంతి పూలసిగ మెరిసె  వాకిట నగ
కపట మబ్బు పగలేని నవ్వేపువ్వు కళల ఊరు
భాయిభాయీ కలిపే చేయిచేయి కష్ట సుఖాల పల్లె
------------------------------------------------------
(ఇంకా ఉంది)


కామెంట్‌లు