ఆశల చుక్కాని అక్షర గవాక్షాల నడిచే ఊరది
ఇంపుగ సొంపుగ కవి కలానికు ఊతమైన ఊరు
సాగే రహదారి బాటసారి కొత్తకాంతులే ఊరు
గుండెలో దాచె పల్లెజీవి పగలు రేయి కష్టజీవి తల్లి
నింగి దిగిన జాబిలి వొంగి నేలను ముద్దాడే ఊరు
ఆనందం బాహుబంధాల పైరు పొంగే ఇంటి పల్లె
మనిషి మనిషీ మాట్లాడే మరుసల బంధం ఊరు
కమ్మరి మల్లయ్య మామ వడ్ల బ్రహ్మయ్య తాత
బావ అన్న అక్క తమ్మి అవ్వ అయ్య ప్రేమ ఊరు
పెద్దింటి పేదింటి జనం మమతతో కాచేది ఊరు
అన్నపానీయాల తీర్చే ఆకలిదూపల మనిషి ఊరు
అక్కరకు మనిషి బాధల మనసు రక్షణకోట జీవి
పనిలోన దివారాత్రి రికాంలేక కనుల దాచె పల్లెనే
నింగి చుక్కలు నేల పూలు కాపాడే ఊరంత వింత
పలుకులేక పలుకరాక వొరలో పెట్టి నిలిపె ఊరు
ప్రేమగా ఊరు మమతల పందిరి సందడి పల్లెజీవి
ఏరులు సెలయేరులు పారే గంగ నేలక్రాంతి ఊరు
ఆటపాటలు నేర్పి ఆడించే మనిషి ఊరు పోషణ
అమ్మ గోము లాలనలో ఎదిగిన ఊరే చెట్టుచేమ
ప్రకృతి నీడల చతుర్శాల మేడ దోని జారే ఊరు
కట్కాల కరెంట్ మీటల మిషన్ల ఏలికే ఊరుతీరు
============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి