ఊరుగాలి ఈల 55:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
అలసట తెలియని ఆటల ఊరు ఆడీపాడే హేల
అలసటదీర తేలే ఆనందాల పల్లె పర్వం పర్వాల
నేల సందడి ఊరేగే నింగి పతంగి ఊరు సంక్రాంతి

మనిషి మనిషీ ఎదచాలనం ఎగిసేను ఊరుమట్టి
ఆరాధనల అంతర్యామి గుడిబడి నిండే పల్లెసీమ
మిణుగురు పూలు కాంతిదేలు చీకటి కీచు గొంతు

బజారు అంగడి మనిషి అచ్చెరువు గస్తీ సందడి
చాటల వడ్లు దోసిట పూలు విరిసే పల్లె దోసిళ్ళ 
ఆనవాలు ఉనికి గట్టిమట్టి ఊరు పాలిచ్చు అమ్మ

పల్లవి చరణాలు పల్లవించే పాట మూట  పల్లెగాధ 
ఆశజూపని అంగన గలగలా కంగన ఊరు బ్యూటి
ఆశతో మనసిచ్చి మనువాడే అందం నేల బంధం

అమ్మడు గుడి గుడిసే ఎగిరె రివ్వు రెక్కలే ఊరు
చెమ్మలేని దారి ఊరు పాదాల మండుటెడారి
చేదబావి నీరు చేదుటే చెమట నుదుటిజీర ఊరే

ఆణిముత్యాలు మట్టిమాణిక్యాల కాంతి ఊరుకళ
ఇటుక గోడల కట్రాతి సున్నం ఇల్లు మనసే గొప్ప
తోటలో మాలి నెలరాజు వన్నెలు దీరు మాఊరు

బతుకున బతుకు మైదానాల పరుగు గొప్ప పల్లె
దండమే దశగుణం తెచ్చే సుగుణం ఊరంత
శ్రావణమేఘాల వానగీతాలు ఆడే పల్లె పండుగ

----------------------------------------------------

(ఇంకా ఉంది)

కామెంట్‌లు