అక్కడేదో శబ్దం ఉలిక్కిపడ్డది ఊరు వెన్నుతట్టూ
ఎవరినీ అడగకు మీ ఇల్లెక్కడని పక్కే పల్లె సడి
ఆటవిడుపు కొంత ఊరుమనసు కొంత నడకనవ్వే
అలవాటు తప్పిన నిద్ర ఊరేమో ఆకలి మౌనం
ఎవరైనా ఇక్కడ నిప్పంటే ఊరే తప్పులేని ఉప్పు
అడవి పిలుపే ఆమె మనసు చీకటిలేని ఊరది
నైస్ గా వచ్చుడు ఐస్ గా చెప్పుడు లేని మిస్ పల్లె
పిచ్చోడుకాదు పక్కోడు ఊరంతా ఇదే చెడుగుడు
ఏదో తెలుసని వస్తే ఎవరు నువ్వనే ఊరు నోరు
చేపపిల్ల చూడని వేపపుల్ల వాడని ఊరే ముద్దు
కంచం మంచం ఒక్కటే తిండి తప్పలే వేరైన ఊరు
గొప్ప చెప్పకు మట్టే మనిషంత పనిలో తేనె ఊరు
కొంత ఊరట కొంత బాసట తప్పెట్లే తాళం పల్లెల
ఎవరినీ వీడరు వదలరు చిక్కుడు దొరకడుతీరే
అబ్బా ఉబ్బిపోకు 'షో'కురాని సోకు మారాకు పల్లె
దోస్తీపట్టు కుస్తీపట్ట ఆనకట్టలేని వరద ఊరేసరదా
అంతా మోఖాన్నే తెరలేదు తోలుబొమ్మ అరే! పల్లె
రొట్టెమట్టి సుద్దముక్క ఊంపెట్టే పలక బడేఊరు
ఒట్టు చాటపట్టు గింజలు ఆడు పాటదాటే ఊరు
ఆటవిడుపు ఊరు కాటుగలువదు మనసుమంచె
ఊగేటి కళల కాణాచి పెట్టదు పేచీ పల్లె బల్లే బల్లే
===============================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి