నా దేశం ఆకుపచ్చ చెట్టు వీచే గాలి స్వేచ్ఛ కొమ్మ
ఊర్లు పట్టుగొమ్మలు వేర్లు ఎదఎగిరే నింగి జండా
నాగరికత సంస్కృతి విలువల రక్షణ పల్లె రిపబ్లిక్
బడి పిల్లలు తిరిగే వాడలు ఎగిరే జండా పండుగ
బడిలో చావడిలో రిపబ్లిక్ డే నేడే జండా వందనం
నడిచే బడిపిల్లల పాదాలు నవ్వేగువ్వేలే ఊరంతా
పప్పుబెల్లాలు కొబ్బరి తీపి ఊరుకన్నే దేశమంటే
నలుదిక్కుల కలియజూసే ఊరంతా జన పండుగ
పల్లె పల్లే జనక్ జనా జనారే దేశ్ కా ధడ్కన్ హో
చెట్టుచేమ ఊగే ఊయల న్యాయ చట్టాల వొడి
రాజ్యాంగమే కదా నిను నను కాపాడే శక్తి మట్టిలో
అమ్మబాట బడిబాట రాజ్యమేలే సదా పల్లెబాట
కనులచూసే చల్లన ఊరు జనుల కాచేదే వాడనీడ
ఆటలోన మైదాన రేఖ కాలిబాట నడక పల్లె తోడ
ఆలన పాలన విజయగీతి పలకపై దిగే అక్షరపల్లె
జనహితం జగహితం బతుకు ఎగిరే జలధి అల
మౌనసీమల మనిషిమాట మూగ బాసే పల్లెసీమ
ఎగిరేసే పల్లీయం జయపతాక కవితల భావ వీచిక
అందచందాల రాణిమీటే పల్లెవీణల పగలే వెన్నెల
శకటమేల ఎగిసే కళల భారతి పల్లె అందె గలగల
జాతిగుండె ఆలపించే గీతమే ఊరు ఊపిరి సిరి
--------------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి