ఒక అడవిలో ఎలుక,చిలుక, పిచ్చుక చాలా స్నేహంగా ఉండేవి.
వీలు దొరికినప్పుడల్లా ఆటల పోటీలు నిర్వహించుకునేవి.
ఆ పోటీలల్లో ఎప్పటికి చిలుక గెలిచేది.చిలుక ఇంకా సంతోషంతో కర్రసాము,గులేరు,
బాణం పుల్లా ఆటలునేర్చుకుంది.
ఒకరోజు ఈ మూడు కలిసి వేరే అడవికి వెళుతుండగా మార్గమధ్యంలో వేటగాడు పన్నిన వలలో ముందు నడిచే పిచ్చుక చిక్కుకుంటుంది. అప్పుడు ఎలుక,చిలుక ఈ విషయాన్ని గ్రహించాయి.మన మిత్రునికి ఆపద వచ్చిందని తెలుసుకున్నాయి. బాధపడుతూ ఒక ఉపాయాన్ని ఆలోచించాయి.
అంతలో వేటగాడు రానే వచ్చాడు.
పిచ్చుకను సంచిలో వేసుకొని వెళుతున్నాడు.అతడు వెళ్లే దారిలో చిలుక,ఎలుక ముందుచూపు తోటి దూరంగా వెళ్లి కూర్చున్నాయి.చిలక బావ,చిలక బావ నీకు చాలా ఆటలు వచ్చు కదా!
గులేరు ఆటను ఉపయోగించుమని వెంటనే ఎలుక వెళ్లి గులేరును తీసుకు వచ్చింది.
వేటగాడు వచ్చే మార్గంలో కూర్చొని గులేరులో రాయి పెట్టి గురిచూసి అతని మోకాలుకు గట్టిగా దెబ్బ తగిలేటట్లు చిలుక కొట్టింది.
వేటగాడు ఆ దెబ్బను తట్టుకోలేక కింద పడ్డాడు.
వెంటనేఎలుక వెళ్లి సంచిని కొరికి పిచ్చుకను కాపాడింది.
మూడు కలిసి సంతోషంగా అడవిలోకి ప్రవేశించాయి. వేటగాడు బాధపడుతూ, గెంతుతూ ఇంటికి వెళ్లిపోయాడు.
కలిసి ఉంటే కలదు సుఖం అనే నీతిని తెలుసుకున్నాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి