వచ్చింది వచ్చింది వచ్చింది
క్రోధినామ వత్సరం వచ్చింది
వధించే వధించే తావధించే
మనమత్సరాన్ని అధివదించే !
మన మంచిని ఆశించిన అది
మనందరకు మంచిని చేసింది
మన శుభాన్ని అది చూసింది
ఆశుభాన్ని అది తొలగించేసింది !
మనసారా మన హితవును కోరి
మన మదిలోన అది ఇక దూరి
మస్తు ఆనందాన్నిక కలిగిస్తుంది
తధాస్తు అని మనల దీవిస్తుంది !
సంవత్సరం పొడుగునా తాను
తత్సారం చేయక అడుగేస్తూను
అనుసరిస్తూ తావస్తూంటుందిక
మన లోగిలిలోనికి ఇక చెక చెక !
నచ్చే మెచ్చే వచ్చే ఈ వత్సరానికి
స్వాగత హారతి మనం అందిద్దాం
సుస్వాగత జ్యోతిని ఇక వెలిగిద్దాం
ఖ్యాతి ప్రఖ్యాతి దానికి కలిగిద్దాం !
బంధుమిత్ర పుత్ర కళాత్రాదులంతా
కలసి మెలసి చేరుకోండి మాచెంతా
స్వాగతగీతం పాడుదాం రండంతా
సంతోషాల వెల్లువతో మనమంతా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి