హలో కిలాడీ భామ:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
హలో కిలాడీ ఓ నా భామా
చలో అందిలే ఇక నా ప్రేమా
ఆ ప్రేమ విందునే తిందామా
అందుకు ముందే ఉందామా!

ప్రేమా ప్రేమా అనుకుంటూ
నా వెంటే ఇక నీవే వుంటూ
తెగ ప్రేమించేస్తున్నావే నన్ను
పాగా వేసి కొట్టేస్తున్నావే కన్ను

నా మదిలో  కుదురుగా ఉన్నావు
నా పతి గతి నీవే అని అన్నావు
ఆ మాటలు ఏమాయెను ఇప్పుడు ?
మరి చేయవు ఎందుకు చప్పుడు ?

నా ప్రేమను ధ్వంసం చేశావు
నీవు నన్నే ఇక వదిలేసావు
నా గుండెలో మంటలు రేపావు
పొగలను సెగలను రాజేశావు !

నేను ఇక ఒంటరినైపోయాను
నా ఇంటికి ఏమని ఇక పోను
మా అమ్మానాన్నల మాటలు వినక
నీ కమ్మని ప్రేమకై పడ్డాను నే నీ వెనుక  !

నా ప్రేమను నిలువున సమాధి చేశావు
నా జీవిత పునాదిని కూల్చేశావు
ఏం ద్రోహం చేసాను నేను నీకు
నా గుండెల్లో దించావు కసితో బాకు !

కిలాడివైనా ఇంత కిలాడివని అనుకోలేదు
ప్రేమ వెనుక నీ అసలు రూపం కనుకోలేదు
ఏది ఏమైనా చేసావులే నన్ను మోసం
ఉరక విడువదు నిన్ను నీవు చేసిన ఈ దోషం !


కామెంట్‌లు