మన అంబేద్కర్:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా
అస్పృశ్యతను ఎదుర్కొన్న ధీరుడు
శాంతియుత మనఉద్యమ కారుడు
మహా మనీషి ప్రజల ప్రభాకరుడు
మహిలోమెరిసేమన అంబేద్కరుడు

రాటుదేలిన మన రాజకీయ వేత్త
అర్థశాస్త్రం చదివిన ఘన ఆర్థికవేత్త
భరతగడ్డపై పుట్టిన అంబేద్కరుడు
చరిత కలిగి వెలుగు ప్రభాకరుడు !

కులాల కుళ్ళు పై తన విల్లును సంధించాడు
అంటరానితనాన్ని ఇంట లేకుండా బంధించాడు
భారత రాజ్యాంగ రచన చేసి అందించాడు
న్యాయవాదియై పలు కేసులు శోధించి సాధించాడు

ఎన్నో అవమానాలను భరించినవాడు
కన్న కలలను సాకారం చేసుకున్న రేడు
భరతమాత ముద్దుబిడ్డ మన అంబేద్కరుడు
భారతావనిలో వెలిగిపోవు మన ప్రభాకరుడు !

మహారాష్ట్ర లోని మౌ పట్టణం అతను పుట్టిన అడ్డ
రాంజీ భీమాబాయి పుణ్య దంపతుల ముద్దుబిడ్డ
లెక్కలేనన్ని అవమానాలతో తానంత చెడ్డ
మొక్కవోని ధైర్యంతో అతనే అయ్యాడు ఇక దొడ్డ !

రమాబాయి సవితా వనితల భర్త
ఆరాట పోరాటాల సంఘ సంస్కర్త
ఇన్ని గుణాలున్న మన అంబేద్కరుడు
ఈ విశ్వంలో మెరిసి విరిసే మన ప్రభాకరుడు !

అందుకే మన కెసిఆర్ సారు గారు
వారి నిలువెత్తు విగ్రహాన్ని చెక్కించినారు
చరిత్ర పుటల్లో నిలిచిపోవు ఈ శిలా రూపం
భావితరాల వారికి ఇది ఒక అపురూపం!

.

కామెంట్‌లు