ఏమని చెప్పను చెలియా
ఎంతని చెప్పను సఖియా
విడువని నీ జతనెప్పుడు
వడువని నా కథనిప్పుడు !
నీ ప్రేమ విందునే తింటిని
నేను నిన్ను నమ్ముకుంటిని
నా వాడవని నీవు అంటివి
ఏల మరి విడిగా నీ ఉంటివి!
నువు ప్రేమిస్తున్నావని అన్నావు
నా ప్రేమ గీతమును విన్నావు
సైలెంటగా ఎందుకు
ఉన్నావు ?
సై సై అంటూ నీవు రాకున్నావు ?
చేతిలో చెయ్యేసి చెప్పినావు
ఇచ్చిన మాటనే తప్పినావు
నీప్రేమ బుట్టలోన కప్పినావు
వగల మాటలను సెప్పినావు
నీ వగల మాటలు నమ్మి నేను
నా సర్వస్వం ధార పోసినాను
ఇంత దారుణం చేస్తావనుకోలేదు
ఇక ఐపాయే నా బ్రతుకంతా చేదు !
ఏమని చెప్పుకోను ఇక నేను
నీ తలపులలో నేనుండలేను
నా ప్రేమను దగా చేసినావు
దూరంగా తొలగిపోయినావు
నీతో నేను ఎంత చెప్పుకున్నా
నీవే అయ్యావులే నా కన్నా మిన్న
నా ఓటమిని నే ఒప్పుకుంటున్నా
నాతో నీకు పనిలేదని తప్పుకుంటున్నా !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి