శివ సత్యాలు:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
శివుడే దేవాది దేవుడు
శివుడే మన ఆదిదేవుడు
శివుడే పరమ పురుషుడు
శివుడే మన పరాత్పరుడు !

శివుడే సార్వభౌముడు
శివుడే సర్వేశ్వరుడు
శివుడే సర్వ జగత్ కర్త
శివుడే సర్వ శాసనకర్త !

శివుడే అనాది దేవుడు
శివుడే పునాది దేవుడు
శివుడే మోక్షా దీక్షకుడు
శివుడే అనాధ రక్షకుడు !

శివుడే జగదానందకారకుడు
శివుడే పరమానంద ప్రేరకుడు
శివుడే సర్వ శిక్షాభ్యాసనుడు
శివుడే నిత్యసర్వరూపకుడు !

శివుడిని నియమించిన
మరొక దైవము లేడు
శివుడిని పుట్టించిన
వేరొక దైవం లేనేలేడు !

శివుడే సర్వ పాలకుడు
శివుడే సర్వ నియంత్రకుడు
శివుడే సర్వ బిక్ష ప్రేరకుడు
శివుడే సర్వ శ్రేయోధాయకుడు !

ఇది సత్యం సత్యం సత్యం.
ఇది నిత్యం నిత్యం నిత్యం
నమశ్శివాయ ఓం నమశ్శివాయ
శివ ఏవో దేవాది దేవాయః !


కామెంట్‌లు