మన తెలంగాణ అమర జ్యోతి
తెలుపు మన అమరుల ఖ్యాతి
స్వరాష్ట్రం సాధించుటకు వారు
సొంత ప్రాణాల త్యాగం చేశారు !
మన విద్యార్థులందరూ పదుర్కోని
ఘన తుపాకి తూటాల ఎదుర్కొని
స్వరాష్ట్ర ఉద్యమాన్ని సాగించారు
ప్రత్యేక రాష్ట్రంకై వారు వాదించారు
రెండొందల అరువది ఐదు మంది
సాగించిన సమరంలో మృతి చెంది
అమరులై కలిగించిరి ఎనలేని రంధి
అది కలిగించె మనకెంతో ఇబ్బంది.!
విద్యార్థులు ఉద్యమాన్ని నడపకుంటే
తూటాలకు ఎదురొడ్డి నిలవకుంటే
వచ్చేదా మనకు ప్రత్యేక రాష్ట్రం
సచ్చేదా సమైక్య రావణ కాష్టం!
అమరుల ఉద్యమ స్ఫూర్తి తెలుపుటకై
ఆ వీరుల ఘన కీర్తిని స్తిరంగా నిలుపుటకై
నిర్మించారు అమర జ్యోతి స్థూపాన్ని
చాటి చెప్పారు అమరవీరుల ప్రతాపాన్ని!
ఇది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది
స్ఫూర్తిదాయకంగా నిలుస్తానంటుంది
మన అమరుల ఆశయాలకు ఇది నిలువుటద్దం
మనం పూజించేటందుకు కావాలి సదా సన్నద్ధం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి