ఇలా అవుతుందనుకోలేదు !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.--సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
అతడు ఆదర్శం అనుకున్నాం అంతా
నిదర్శనంగా ఉంటాడు
 అనుకున్నాం కొంత
అలా ఆలోచించి వేశామంత ఓట్లు
ఇప్పుడు పడుతున్నాము ఎన్నో పాట్లు !

పాలిచ్చే గేదెను  వదిలిపెట్టి
కాలిచ్చే దున్నకు పట్టం కట్టి
దూరమైతిమి మా ఇష్టాలకు
చేరువైతిమి ఇక మాకష్టాలకు !

కొనుక్కున్న మా భూమి పాయే
కట్టుకున్న మాఇల్లు కూడా పాయే
రైతు బంధు ఇక లేకుండా  పాయే
మా బ్రతుకంతా ఆగమాగమాయే !

ఇదేమి పాలన ఇదేమి పాలన
ఆలన పాలన మరిచిన పాలన
కొలువులు లేక  కూలిన పాలన
నెలవులు  లేని తప్పుడు పాలన !

ఆరు గ్యారెంటీలకు పట్టే దుర్గతి
ఆ వైపు పాలకులకు లేదు మతి
ప్రజలకు కలిగెనుగా ఇక ఆపతి
ప్రభుతైనా చూపాలిగా సింపతి !

  గత ప్రభుత్వం చేసెను అప్పులు
ఈ ప్రభుతకు కలిగెనుగా తిప్పలు
అని చెప్పుకుంటున్నరు పాలకులు
కని పరిపాలించలేక నేటి ఏలికలు!

ఏది ఏమైనా ప్రజలకు కల్గె ముప్పు
అని చాటింపుకు కొట్టాలిరా డప్పు
మళ్లీ చేయొద్దురా ఇలాంటి తప్పు
వెళ్లి అందరికీ తప్పక నీవిక చెప్పు !


కామెంట్‌లు