నమో నమో విష్ణురూపా
నమో నమో కృష్ణ దీపా
రాశావు మా తలరాత
గీశావులే మాకు ఓ గీత !
అద్భుత గీతా ఆరాత కలిసి
భగవద్గీతగా అది ఇక వెలసి
అందించె గీతామాతా సారం
చిందించె మమతల మమకారం
భగవానుడు కృష్ణుడు చెప్పిన గీత
భగవద్గీతై ఇల మోగించెను మోత
విని మార్చుకుందాం మన తలరాత
కని ఓర్చుకుందాం ఆ విధాత రాత !
ఆ భగవంతుని ఈ గీతామాత
ఈనరుల సురుల సిరి సంజాత
మాధుర్యపు రసమయ సంగీత
నిత్య పారాయణ మా పారిజాత !
అండ దండ లందించే ఈగీత
చండ ప్రచండ మన సుప్రభాత
సహజ వనరుల మన సంజాత
సహకరించి చెరించే ప్రజామాత !
ఓంకారాయ నమహాః అని అంటు
ఓంగీతాపారాయణ నమహ వింటు
సరుగున పరుగున అంతా రారండి
వెరువక మరువక పూజలో చేరండి
పాంచ జన్యమును ఊదండి
డమరుక దరువునే వేయండి
అడుగుల భజనను చేయండి
ఆగీతా మాత పల్లకి మోయండి!
గత జన్మ వాసనలు లేకుండా
సుస్మిత వాసనలే మదినిండా
నింపుకొని మనం నడుస్తుండా
గీతా మాత అందించును అండా!
గీతామాతను దర్శించాలి ముందు
దర్శనమైతే మనందరికీ పసందు
వెంటనే చేసుకోవాలి మనం విందు
అష్ట కష్టాలు రానే రావిక ముందు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి