వచ్చింది వచ్చింది వచ్చింది
మన అక్షర సంక్రాంతి వచ్చింది
తెచ్చింది తెచ్చింది తెచ్చింది
తాను లక్ష వరాలను తెచ్చింది !
వినవమ్మ వినవమ్మ చెల్లెమ్మా
కనవమ్మ కనవమ్మ నీవమ్మా
అక్షరాలను నువు నేరువాలమ్మా
లక్ష వరాలను ఇక పొందాలమ్మా !
వింటేను కంటేను ఓ మా చెల్లెమ్మా
ఆ అక్షరాలే మన ఆయుధాలమ్మా
తక్షణం ముందుకు రావాలమ్మా
అక్షర విందువులు చేయాలమ్మా !
చిన్నారి పొన్నారి మా చిట్టెమ్మా
పలక బలపం నీవిక పట్టాలమ్మా
అదురు బెదురు అసలే లేకుండా
చదువు సంధ్యలూ నేరువాలమ్మా!
సిగ్గు శరము అసలే వలదమ్మా
అక్షర శరము నీముందే కలదమ్మా
చదువుల పంటను సాగించాలి
పదవుల గంటను మోగించాలి !
అంబవు జగదంబవు నీవమ్మా
జగతిలో నీ ఉంటావు ముందమ్మా
చదువులో ఆసక్తిని చూపాలమ్మా
పదవిలో స్వశక్తిని సాధించాలమ్మా
మూఢనమ్మకాలను నమ్మొద్దమ్మా
విద్య నిగూఢ విత్తమని నమ్మమ్మా
కనుగొంటేనూ ఇలలోన ఈ వింత
ఉండనే ఉండదు నీకు చీకూచింత!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి