కొత్తగా:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
ప్రయాస ఒక్క వెనుదిరుగని ప్రయాణ దారికే తెలుసు
నడక శక్తిని మోసుకెల్తున్న మనిషి
పరుగు లోపలి ధాతు 

పోవడమే కాని తిరిగిరాని అభిమన్యుని పద్మవ్యూహం 
కొత్తసంగీత గీతాలు క్షణం వినిపిస్తూ.
దర్జాగా శూన్యంలోకి కాలం@2024

కొనసాగే కాలంలోకి @2025
ఆనందాల నిర్భయ స్వేచ్ఛాదారులు 
ప్రతిక్షణం మీ అంతరంగాలు 
మీటాలని...

తరతరాలెన్నో తరాలుగా చూపించే పాత కథేలేగా 
కొత్తగా ఏముండు మరి!? 
ఆత్మతృప్తి నీదినాది వేడుక
పేరుకే కాలం దాని కొత్త సంచిక 

ఐనా ఆహ్వాన సంతోషాల వేళ 
హృదయ స్పందన వినిపించే
శుభాకాంక్షలు మిత్రమా...


కామెంట్‌లు