జనహితం కోరేవి!:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
తోటలోని పూవులు
ఊటలోని జలములు
జనహితం కోరేవి!
పాటలోని పదములు

ప్రవహించే యేరులు
విహరించే పక్షులు
జనహితం కోరేవి!
ప్రేమించే మనసులు 

చిందించే నగవులు
ప్రకాశించే ప్రమిదలు
జనహితం కోరేవి!
సాయపడే కరములు

పుడమిలోని తరువులు
పొలంలోని పైరులు
జనహితం కోరేవి!
కవీంద్రుల కలములు

మహనీయుల వాక్కులు
గురుదేవుల బోధలు
జనహితం కోరేవి!
శుద్ధమైన తలపులు


కామెంట్‌లు