మాటల ముత్యాలు:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
బంధాలను దూరము
జీవితాలు ఘోరము
చేసుకోకు ఎన్నడు
నిలుపుకున్న ధన్యుడు

వెలుగులీను సూర్యుడు
గుణంలోన శ్రేష్ఠుడు
గౌరవింప మాన్యుడు
ఎంతైనా అర్హుడు

మాట మీద ఉంటే!
జగమంతా వెంటే!
సార్ధకము జీవితము
సద్బోధలు వింటే

కఠినమైన మాటలు
హృదయాల్లో మేకులు
చెప్పొద్దు చాడీలు
విరచనోయి!మనసులు

చెప్పువారు నీతులు
తవ్వరాదు గోతులు
విపరీతపు బుద్ధులు
పాడు చేయు బ్రతుకులు


కామెంట్‌లు