చిరు నవ్వుల చిన్నారులు:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
అలతి అలతి పదాలతో
చిట్టి చిట్టి పెదాలతో
అలరించే చిన్నారులు
అందరికీ బహు ఇష్టులు

అందాల నవ్వులతో
మందార మోములతో
చిందులేసే బాలలు
చంద్రోదయ కిరణాలు

తేనెలూరు పలుకులతో
రాజహంస నడకలతో
ముద్దులొలుకు పసి పిల్లలు
విరబూసిన సిరిమల్లెలు

శుద్ధమైన మనసులతో
ముద్దబంతి సొగసులతో
బుద్ధిలోన కడు శ్రేష్టులు
వృద్ధికి రాచ బాటలు


కామెంట్‌లు