చక్కని బామ్మ మాటలు:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
అందమైన పక్షులు
స్వేచ్చగలవి పక్షులు
నింగిలో  హాయిగా
విహరించే పక్షులు

వనంలోని పూవులు
ఇష్టమైన పూవులు
కనువిందు చేసే
సొగసులీను పూవులు

ఇంటిలోని పిల్లలు
ముద్దులొలుకు పిల్లలు
అవనిలో అందరిని
అలరించే పిల్లలు

పుడమిలోని తరువులు
ఫలాలిచ్చు తరువులు
మానవాళి మనుగడకు
ఉపకరించు తరువులు

వసుధలోన వనితలు
సదనంలో జ్యోతులు
కుటుంబాన్ని దిద్దే
బాధ్యత గల వనితలు

బుద్ధి చెప్పు గురువులు
గద్దించే గురువులు
సమాజాన పూజ్యులు
జ్ఞానమిచ్చు గురువులు


కామెంట్‌లు