అమ్మ ప్రేమ అద్భుతము:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
అమ్మ పిలుపులో ఉంది
అనురాగము మెండుగా
ఆమె గుండెలో ఉంది
ప్రేమామృతము నిండుగా

తల్లి గుణంలో ఉంది
త్యాగమే క్రొవ్వొత్తిలా
మల్లెలాంటి మనసుంది
జీవజలపు ఊటలా

మాత మాటలో ఉంది
ఆశీస్సులు ధారలా
అనునిత్యం  వెలుగుతుంది
ఆకసాన తారలా

మాతృమూర్తి బహుమానము
లేదు లేదు కొలమానము
ఆమె ఉంటే  కుటుంబము
అగును శోభాయమానము


కామెంట్‌లు