బాలలకు బాటలు-బంగారు మాటలు:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
ఆకసాన సింగిడి
పూస్తేనే అందము
మనసులోన ఒత్తిడి
తగ్గితే ఉల్లాసము

జీవితాన అలజడి
రేపును సుడిగుండము
పదే పదే భయపడి
తెచ్చుకోకు గండము

అదుపులేని మనసులు
చెరుపునోయి! బ్రతుకులు
తుదకు మిగులు భస్మము
కల్గించును విస్మయము

హద్దులోన ఉంటే
అందరికీ క్షేమము
మహనీయుల మార్గము
తలపించును స్వర్గము


కామెంట్‌లు