శతకోటి వందనాలు:- -- గద్వాల సోమన్న,9966414580
అమ్మ జోలపాటకు
ఆమె గోరు ముద్దకు
శతకోటి వందనాలు
స్వచ్ఛమైన ప్రేమకు

చల్లనైన మనసుకు
వెలలేని సేవలకు
శతకోటి వందనాలు
అమ్మ చూపు శ్రద్ధకు

ఘనమైన బాధ్యతకు
పిల్లలపై ప్రేమకు
శతకోటి వందనాలు
కన్నతల్లి త్యాగముకు

రుచికరమైన వంటకు
ప్రేమగల వడ్డనకు
శతకోటి వందనాలు
కడుపునింపు అమ్మకు

ఆమెకున్న తపనకు
అమ్మ అనురాగానికి
శతకోటి వందనాలు
ఘన ప్రేగు బంధానికి


కామెంట్‌లు