చదువుల తల్లి :- ఉండ్రాళ్ళ రాజేశం -సిద్దిపేట -9966946084
  ఆడుతు పాడుతు అల్లరి చేస్తూ
 నవ్వుల మల్లెల సావిత్రిబాయికి
చిన్ననాటే జ్యోతిరావుపూలేతో వివాహము
ఐనా సావిత్రి ఆశలు ఆశయ సంకల్పనకై
 భర్త చెంతనే అక్షరాలనొంది
 అగ్రవర్ణముల కోపాగ్నిలందు
 అదరక బెదరని సావిత్రి
 బాలిక విద్యకై శ్రీకారం
 తొలి ఉపాధ్యాయురాలుగా ప్రయాణం
 రాళ్ళ, పేడల వర్షాలు కురిసినా
 గమ్యం చేరిన సావిత్రిబాయి పూలే
 బాలికలందరిని ఏకం చేసి 
 బాలిక బడులనేర్పాటు చేసి
 విద్యను పంచిన ఉత్తమురాలు
 సతీసహగమన వ్యతిరేక పోరాటం చేసి
 స్త్రీ జనోద్ధారణకు చైతన్యం నింపి
 మహిళా శక్తిని మేల్కొల్పి
 గ్రంథ సారములను విప్పి చెప్పి
 చరిత్రలో లికించిన సువర్ణ బీజం
 సావిత్రిబాయి పూలే జయహో జయహో
 నేడు నింగికి నేలకు నిచ్చెన లేసేటి
మగువలందరి విజయదరహాస కెరటం
సావిత్రిబాయి పూలేకు జైజైలు
===========================


(జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతి)

కామెంట్‌లు