రాజయ్యకు ఒక్కగానొక్క కొడుకు బాలు. బాలు అన్నింట మేటిగా హుషారుగా ఉండేవాడు. హదిహేనేళ్ళ వయసులోనే మోటార్ సైకిల్ పై తిరిగేవాడు. అందరూ బాలును చూసి నేర్చుకోవాలి అంటుండేవారు. ఎవరికి ఏ అవసరం ఉన్న క్షణాల్లో మోటార్ సైకిల్ పై తిరిగి వచ్చేవాడు. బడికి కూడా బాలు మోటార్ సైకిల్ పై వెళ్లడంతో ఉపాధ్యాయులు మందలించి, తండ్రి రాజయ్యను పిలిచి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
తండ్రి రాజయ్య బాగా ఆలోచించొడు. కానీ కుటుంబసభ్యుల మాట కాదనలేక మౌనంగా ఉండేవాడు. బాలును ఎలాగైనా మోటార్ సైకిల్ నడిపించడం మాన్పించాలనుకున్నాడు. ఒకరోజు ఇంటి ముందర ఒక కోడి తన పిల్లలతో తిరుగుతుంది. రాజయ్య ఒక్కసారిగా పరుగున వెళ్లి ఒక కోడిపిల్ల ముందు ఆగాడు. కోడిపిల్ల గజగజ వణుకుతూ ఆగమాగం చేయసాగింది. కాసేపటికి రాజయ్య మళ్ళీ పరుగున వెళ్లి తల్లి కోడి ముందు ఆగాడు. తల్లి కోడి అలాగే నిల్చొని, రాజయ్యపైకి కొక్కరకో అంటూ అరవసాగింది. రాజయ్య ప్రవర్తనను చూస్తున్న కుటుంబసభ్యులు విషయం అర్థం చేసుకున్నారు.
మరుసటి రోజు నుంచి బాలుకు సైకిల్ మాత్రమే ఇచ్చి బడికి, పనులకు వెళ్ళుమనేవారు. బాలు పెద్దగయ్యాక రహదారుల భద్రతల గూర్చి తెలిపి అవసరం మేరకే మోటర్ సైకిల్ ఇవ్వసాగారు. బాలు కూడా నెమ్మదిగా ప్రయాణం సాగించసాగాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి