సంబరాల సంక్రాంతి:- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
 సంక్రాంతి పండుగ వచ్చింది
సంబరాలెన్నో నింపింది
 కోడిపందాలు పెట్టింది 
 గెలుపోటములను పంచింది 
 గాలిపటాల నెగిరేసింది
 ఉత్తరాల సందేశం పంపింది
 పిండి వంటలు వండింది
 తీపి రుచులను చూపింది 
 కొత్త బట్టలతో మెరిసింది
 రంగవల్లుతో ముంగిళ్ళు నింపింది 
 గొబ్బెమ్మలతో నిండింది 
 నవధాన్యాలతో మురిసింది
 హరిదాసు కీర్తనలు పంచింది
 గంగిరెద్దులను ఆడించింది
 ప్రతింటా సంక్రాంతి కోలాహలం నింపింది 
 పండుగ శోభలను పంచింది 


కామెంట్‌లు