అతను ఓ గొప్ప ధనవంతుడు. డబ్బుతోపాటు అతనికి అధికారమూ ఉంది. కానీ అతనికి ఎందుకనో క్రమంగా అన్నింటిపైనా ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అతని మనసంతా వేదాంతంపైనా, తత్వశాస్త్రంపైనా కేంద్రీకృతమవుతూ వచ్చింది. అతను తనకు తెలిసిన పుస్తకాలు చదువుతూ వచ్చాడు. కానీ అతనికి అవేవీ తృప్తి ఇవ్వడం లేదు. దాంతో ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడు. అంతేకాదు, తత్వశాస్త్రం, వేదాంతంపై పట్టుకోసం ఎక్కడ చదవాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎవరి దగ్గరకెళ్ళి చదవాలి, ఏ గురువును ఆశ్రయించాలి అని తనకు తెలిసిన వారందరినీ అడుగుతూ వచ్చాడు.
అతని మిత్రులు ఓ జెన్ గురువు పేరు చెప్పి ఆయనను ఆశ్రయించమని చెప్పారు. ఎక్కువ మంది ఆ ఒక్క గురువు పేరునే సూచించడంతో ఆ ధనవంతుడు తిన్నగా ఆయననే కలిశాడు. ఆయన పాదాలపై పడి తనకు వేదాంతం, తత్వశాస్త్రంపైన పట్టు వచ్చేటట్టుగా పాఠాలు చెప్పమన్నాడు. డబ్బులు ఎంతైనా ఇస్తానన్నాడు. మీరు చెప్పే విషయాలన్నీ తననెవరైనా ఏదైనా అడిగితే వారి సందేహాలు తీర్చే విధంగా ఉండాలన్నాడు.
అతని మాటలన్నీ విన్న ఆ జెన్ గురువు ముందుగా మీకు జెన్ గురించి ఏమిటో చెప్పడం మొదలుపెడతానన్నారు. కానీ ఒక్క విషయం. ముందుగా మీరు వెళ్ళి లఘుశంఖ తీర్చుకు రావాలన్నారు.
ఆయన మాట ధనవంతుడికి అంతగా నచ్చలేదు. కాస్త ఎబ్బెట్టుగానూ అనిపించింది. ఏమిటీయన ఇలా అంటారు అనుకున్నాడు. నాకు వస్తే నేను వెళ్ళి రానా...ఈయన నన్ను వెళ్ళమంటాడేమిటీ, ఈయనకు బుద్ధుందా అసలు, ఇలా మాట్లాడుతాడేంటీ, ఛీ ఛీ అని అనుకుంటూనే బయటకు వెళ్ళాడు.
కాస్సేపు తర్వాత అతను మళ్ళీ లోపలికొచ్చి గురువుగారి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
ఏంటీ అర్థమైందా అని అడిగారు జెన్ గురువు.
దానికతను ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది...అని అడిగాడు ధనవంతుడు.
దానికాయన ఎంత పెద్ద ధనికుడైనా కావచ్చు లేదా రాజుగారైనా కావచ్చు లేదా వారి దగ్గర పని చేస్తున్న వారో లేదా పేదవాడో లేదా ఎటువంటి వారో ఇప్పుడు నువ్వు చేసొచ్చిన పనిని ఎవరికి వారు చేయాల్సిందే తప్ప ఒకరి తరఫున మరొకరు వెళ్ళి చేసొచ్చేది కాదుగా. అంతేకాదు, ఆ పనిని మరెవరూ అడ్డుకోలేరు, అడ్డుపడకూడదు కూడా అని అన్నారు.
ఆ మాటతో ఆ ధనికుడికి విషయం అర్థమైంది. అతను ఏమీ మాట్లాడలేకపోయాడు.
కనుక ఈ కథ మనకు చెప్తున్నదేమిటంటే మనుషుల మధ్య ఎలాంటి తేడాలు ఉండవు. అందరూ సమానమే. అంతేకాదు, ఎవరి పని వారే చేయాలి. అయితే ఆ పనికి మరొకరు అడ్డు తగలకూడదు స్పష్టంగా చెప్తోంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి