శాశ్వతాలు అశాశ్వతాలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పువ్వులలోని
పరిమళం
శాశ్వతం కాదు

మోములమీది
సంతోషం
శాశ్వతం కాదు

దేహములోని
ప్రాణం
శాశ్వతం కాదు

ప్రకృతి
సౌందర్యం
శాశ్వతం కాదు

నదిలోని
నీటిప్రవాహం
శాశ్వతం కాదు

కానీ
కవులకవితలు
శాశ్వతం

మరి
కవులపేరుప్రఖ్యాతులు
శాశ్వతం

అట్లే
సాహితీప్రపంచం
శాశ్వతం

కమ్మని
కవితలు
కూర్చండి సదాప్రోత్సహించండి

సాహితీ
జగతినందు
నిలవండి చిరంజీవులవండి


కామెంట్‌లు