సుప్రభాత కవిత : - బృంద
కదులుతున్నవి రోజులు 
కరుగుతున్నవి క్షణాలు 
అరుగుతున్నది వత్సరం 
ఆగమించేను నవ్యనూతనం...

వెనుక తిరిగి చూసుకుంటే 
వచ్చిన విజయాలు 
తెచ్చిన ఫలితాలు 
ముచ్చటే మనసుకు!

చేసిన తప్పులేమున్నాయో 
చూసి సరిచేసుకుంటూ..
మాసిన మమతలకు ఊపిరి 
పోసి పోగు చేసుకుంటూ..

అన్న మాటలకు బాధపడి 
విన్న మాటలు వదిలేస్తూ 
ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ 
మెచ్చుకోలు మాటలు ఊతంగా..

వచ్చినవన్ని  ప్రసాదంగా 
ఇచ్చినవన్నీ వరాలుగా 
తెచ్చుకున్నవి విజయాలుగా 
పంచినవన్నీ సంతోషాలుగా..

అందరినీ కలుపుకుని 
అందరికీ ఆప్తులుగా 
అందరి క్షేమం కోరుతూ 
అందరిలో ఒకరిగా ఉందాం!

కలుపులు తీసిన మనసున 
కలతలన్నీ కరిగిపోయి 
కలుములు  కాలుబెట్టగా 
కనుల పంటగా నిలవాలని..

కొత్త అనుభూతులు పంచుతూ 
వస్తున్న కొత్త ఉదయానికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు