ప్రపంచంలోనే ఇప్పుడు అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించడం సంతోషకరం. అయితే మనదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు పెరగడం లేదు. ప్రజల సంఖ్య పెరుగుతోంది కానీ, వారికి ఉద్యోగ ఉపాధులు ఉండడం లేదు. దీంతో నిరుపేద, పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవుల జీవనం ఏరోజు కారోజు అస్తవ్యస్తంగానే ఉంటున్నదే తప్ప ఆశించిన స్థాయిలో మెరుగుదల ఉండడం లేదు అని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.ప్రభుత్వ బడ్జెట్ లో ఆరోగ్యం, విద్య వంటి ప్రాధాన్యత గల రంగాలకు నిధులు కేటాయింపు నామమాత్రంగా ఉండడం వల్ల మానవవనరులపై ప్రభావం చూపుతుందని మేధావుల విశ్లేషణ. వ్యవసాయ రంగం కూడా కుదేలైపోయింది.
దేశంలో ఉద్యోగ కల్పన నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఏటేటా నిరుద్యోగ శాతం పెరిగిపోతుంది. ఒక పక్క నిరుద్యోగం , మరోపక్క ద్రవ్యోల్బణం తో దేశ ఆర్థివ వ్యవస్థ కుంటుపడుతోంది. ప్రైవేట్ రంగంలో కూడా పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఇక ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన మరీ దారుణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా విశ్లేషిస్తే.. 2014 నుంచి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 22,05,99,238. అయితే వీరిలో కేవలం 7,22,311 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2014-15 నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే 2019-20 మధ్య కాలంలో కొంత మార్పు వచ్చింది. ఈ వ్యవధిలో 1,47,096 మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు
మొత్తంగా దేశంలో నేడు కోట్లాది మంది పేదలు, కార్మిక కర్షకుల పరిస్థితి, ఉద్యోగాలు లేని నిరుద్యోగ యువత పరిస్థితి మరింత దయ నీయంగానే ఉంటోంది. గత మార్చి నెలలో దేశంలో నిరుద్యోగం 7.8 శాతం ఉంటే, ఏప్రిల్‌లో అది 8.11 శాతానికి చేరుకోవడం గమనార్హమని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. గత డిసెంబరు 2022 తర్వాత ఇంతగా గరిష్ట స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే మొదటిసారని పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి.యువత, విద్యార్థులు దేశభవితకు వెన్నెముక లాంటివారు.కాబట్టి వారికి ఆశించినస్థాయిలో నైపుణ్యత, వృత్తిపరమైన ప్రతిభాపాటవాలు పెంపొందించేం దుకు తగిన కృషి చెయ్యడం ఎంతో అవసరం.ప్రభుత్వాలు తమకు ఎదురౌతున్న సవాళ్ళనుఅధిగ మించి నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న జనాభాను శక్తివంతంగా మార్చుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి