దూసుకుంటూ వెళ్ళు
ముందుకు మున్ముందుకు
పేర్చుకుంటూ వెళ్ళు
జీవితానికి పూలబాటలు
చూసుకుంటూ వెళ్ళు
అందాలను చందాలను
పంచుకుంటూ వెళ్ళు
సుఖాలు సంతోషాలు
చేసుకుంటూ వెళ్ళు
దానాలు ధర్మాలు
మోసుకుంటూ వెళ్ళు
కీర్తికిరీటాలు పేరుప్రఖ్యాతులు
ఓర్చుకుంటూ వెళ్ళు
కష్టాలు నష్టాలు
కాచుకుంటూ వెళ్ళు
మానాలు ప్రాణాలు
పూచుకుంటూ వెళ్ళు
అత్తరులు గంధాలు
దోచుకుంటూ వెళ్ళు
మదులు హృదులు
పోసుకుంటూ వెళ్ళు
మొక్కలకు నీళ్ళు
తీసుకుంటూ వెళ్ళు
గుళ్ళకు పువ్వులుఫలాలు
ఇచ్చుకుంటూ వెళ్ళు
సహాయ సహకారాలు
మెచ్చుకుంటూ వెళ్ళు
దాతలను ధర్మాత్ములను
రాసుకుంటూ వెళ్ళు
మంచికవితలు పాటలు
పుచ్చుకుంటూ వెళ్ళు
సన్మాన సత్కారాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి