శివానందలహరి:- కొప్పరపు తాయారు
 

శ్లోకం:పూజాద్రవ్య సమృధ్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే 
పక్షిత్వం న చ వా కిటత్వమపి న ప్రాప్తం మయా  దుర్లభమ్ !
జానే మస్తకమంఘ్రిపల్లవముమాజానే నా తే హం విభో
న జ్ఞాతం హి పితామహేన హారిణా తత్త్వేన తద్రూపిణా !

భావం: పూజా ద్రవ్యములు సమృద్ధిగా ఉన్నవి. ఎట్లు పూజ చేసెదరు? నేను దుర్లభమైన
హంస రూపమునో లేక వరహా రూపమునో ధరించ లేదు! ఓ ఉమాపతీ ! నీ శిరస్సుని  కానీ, పాద పల్లవము ను, కానీ  నేనె
రుగను. హంసరూపమెత్తిన
బ్రహ్మదేవుడో లేక వరహా రూపమెత్తిన విష్ణుమూర్తో  నా తత్వము తెలుసుకో లేక పోయెను కదా !
            *****

కామెంట్‌లు