అవును ....
నేనువంటరినే ....
మీరవునన్నా ..కాదన్న
నేనిప్పుడు వంటరినే !
అప్పుడు....నామెడలో
మూడుముళ్ళు వేసిన
నాసహచరుడున్నప్పుడూ
నేనువంటరినే .....!
పాతికేళ్ళనాడు
తనస్వార్ధం కోసం
అతగాడు పైలోకాలకు
వెళ్ళిపోయినప్పటినుండీ
ఇప్పుడూ నేను వంటరినే.....!
కనిపెంచిన పిల్లలెందరు,
నాచుట్టూవున్నా .....
నిశీధి సమీపించేవేళకు ,
నిండుపున్నమి
నాచుట్టూఅల్లుకునేవేళకు ,
అసలైనవంటరిగా
మిగిలిపోతానునేను...!
అవును మరి-
నేను ఎప్పుడూ వంటరినే!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి