మేఘం
చినుకులుచల్లినా
పిడుగులువిసిరినా
మందుకుపయనించు
కాలం
కాటేసినా
కలసిరాకపోయినా
కదులుముందుకు
దీపం
కొడగట్టినా
దారిచూపకపోయినా
దేవులాడుకుంటూనడువు
స్నేహం
మురిపించకున్నా
వేదనకుగురిచెసినా
మున్ముందుకునడువు
పాదాలు
పరుగెత్తకమొండికేసినా
అడుగులేయకున్నా
ప్రాకుకుంటూనడువు
మార్గం
కనిపించకపోయినా
ముళ్ళుపరచుకొనియున్నా
తీసేస్తూముందుకునడువు
కాయం
గాయపడినా
రక్తంకారుతున్నా
ముందుకునడువు
కళ్ళు
మూసుకుపోయినా
కటికచీకటయినా
కదులుముందుకు
మనసు
మొండికేసినా
మూలుగుతున్నా
మందుకువెళ్ళు
గమ్యం
కష్టమయినా
బహుదూరమయినా
ముందుకడుగులెయ్యి
ప్రాణం
ఉన్నంతవరకూ
ఆశయంసాధించేవరకూ
ముందరకెళ్తుండు
జీవితగమనం
సాగించు
జన్మసాఫల్యం
సాధించు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి