సుప్రభాత కవిత : -బృంద
బంగరు కాంతుల సుందర బింబం 
నింగిని సాగే వెలుగుల రథం 
రంగులు చిందే కిరణపు రాకతో 
పొంగెను పుడమికి  ఉత్సాహం

కొత్త పువ్వులు రేకులు విప్పి 
కొత్త పరిమళం పరిచే వేళ 
కొత్త అందాలు వెల్లి విరియ 
కొత్త ఊపిరి పోసుకుంది నేల

రెక్కలు విప్పి చప్పున ఎగిరి 
చుక్కల లోకం చూసిరావాలని 
ఎక్కువ ఎత్తున యెగిరి తిరిగి 
మక్కువ తీరగ  విహరించే విహంగం

మిరుమిట్లు గొలుపుతూ 
ఎదురుగ నిలిచిన వెలుతురు గని 
బెదరి నిలిచేనేమో దూరము చని 
కనక మయమై పాలమబ్బులు

సుందరమీ ప్రత్యూష సమయము 
సుందరమీ వసుమతి సంబరము 
సుందరమీ కాంచనమయ అంబరము 
సుందరము కాదా కాంచిన మనము?

సురుచిర సుందర తొలిసంధ్యకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు