జానపద సంక్రాంతి జాతీయ కవి సమ్మేళనంలో జానపదానికి పట్టాభిషేకo పోగ్రామ్ డైరెక్టర్ ధనాశి ఉషారాణి సత్కరించిన మద్దిశెట్టి సామేలు తెలుగు కళారత్నాలు సాoస్కృతిక సేవ సంస్థ జాతీయ చైర్మన్ డా యు. వి రత్నo జాతీయ పోగ్రామ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో జనవరి 5 ఠాగూర్ గ్రంథాలయం విజయవాడ లో తెలుగు జాతి పద్య వైభవాన్ని అన్ని దిశల్లో వ్యాపిస్తూ జానపద తెలుగు రత్నo అవార్డుని కవులు అందరికీ ఇవ్వడము జరిగింది. ఐదు రాష్టాల నుండి కవులు పాల్గొన్ని సంక్రాంతి శోభను తీసుకురావడము జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మరియు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వ హిందూ మహా సంఘ్ నాయకులు మద్దిశెట్టి సామేలు గారు సభలో కీలక ఉపన్యాసము చేస్తూ కవులను ప్రభుత్వం గుర్తించేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. జానపదము జనుల గుండెల్లో నిలిసిపోయే కార్యక్రమం జరిగిందని కవులు సంతోషం వ్యక్తముచేశారు. సేవ చక్రవర్తి బిరుదుతో డా. యు. వి రత్నo గారిని ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి సత్కరించడం జరిగింది. పోగ్రామ్ నిర్వహణలో కవులు జానపద సాహిత్యం కొత్త పుంతలు తొక్కుతూ విజయవంతమైంది. ప్రకాశం జిల్లా అధ్యక్షులు కె. వై. రత్నo సూర్యాపేట అధ్యక్షులు నెల్లుట్ల వెంకటేశ్వర్లు నియమించినట్టు డా. యు. వి రత్నo ప్రకటించారు. రంగస్థల కళాకారులు విశ్వామిత్ర ప్రసాద్ గారు సింగర్ పేతురు కార్యక్రమంలో కీలక పాత్ర వహించదడం జరిగింది.
ధనాశి ఉషారాణికి సత్కారం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి