పుష్పవికాసాలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పూలు వికసించాయి
చూపించాయి మనోహరదృశ్యాలు
పూలు ప్రేమించాయి
అందించాయిరమ్మని ఆహ్వానాలు

పూలు అద్దుకున్నాయి
పలురంగులు
పూలు చూపించాయి
అందచందాలు

పూలు చుట్టూచల్లాయి
సౌరభాలు
పూలు కలిగించాయి
సంతసాలు

పూలు ఎక్కాయి
కోమలాంగుల కొప్పులు
పూలు చేరాయి
పరమాత్ముని పాదాలు

పూలు అయ్యాయి
ప్రకృతిప్రతీకలు
పూలు మురిపిస్తున్నాయి
మదులు

పూలు ప్రోత్సహిస్తున్నాయి
కవిపుంగవులను
పూలు ఆకర్షిస్తున్నాయి
సీతాకోకచిలుకలను

పూలు తెలియపరుస్తున్నాయి
పుణ్యవతుల సౌభాగ్యం
పూలు చూపుతున్నాయి
చక్కనిమెత్తని సన్మార్గం


కామెంట్‌లు